న్యూఢిల్లీ: రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ (డేరా బాబా) తోపాటు మరో నలుగురు నిందితులకు పంచకులలోని సీబీఐ స్పెషల్ కోర్టు శిక్షలను ఖరారు చేసింది. నిందితులు ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రంజిత్ సింగ్‌ హత్య కేసులో డేరా బాబాతోపాటు అవతార్ సింగ్, కృషన్‌ లాల్, జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్‌లను దోషులుగా పేర్కొంటూ కోర్టు ఈ నెల 8న తీర్పు చెప్పింది. శిక్షల ఖరారును ఇవాళ్టికి వాయిదా వేసింది. ఆ మేరకు ఇవాళ నిందితులు ఐదుగురికీ శిక్షలు ఖరారు చేసింది.

నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షలతోపాటు జరిమానాలు కూడా భారీగానే విధించింది. డేరాబాబాకు రూ.31 లక్షలు, అవతార్ సింగ్‌కు రూ.1.50 లక్షలు, సబ్దీల్ సింగ్‌కు రూ.1.25 లక్షలు, జస్బీర్ సింగ్, కృషన్‌ లాల్‌కు చెరో రూ.75 వేల చొప్పున జరిమానా విధించింది. వాస్తవానికి అక్టోబర్‌ 12న శిక్షలను ఖరారు చేయాల్సి ఉండగా.. కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జరిమానా సొమ్ములో 50 శాతం బాధిత కుటుంబానికి అందజేయనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.