ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ ఉత్పత్తి (Power Crisis), సరఫరా పరిస్థితులపై సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఇంధన శాఖకార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, జెన్‌కో ఎండీ శ్రీధర్‌సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. బొగ్గు సరఫరా, విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపైనా సీఎం చర్చించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరంగా కరెంటును సరఫరాచేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుని ఆమేరకు తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నామని అధికారులు తెలిపారు. మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి 2 ర్యాకులు బొగ్గు అదనంగా వచ్చిందని సీఎంకు వెల్లడించారు. రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్‌విద్యుత్‌ ఉత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచామని అధికారులు తెలిపారు.

బొగ్గు కొరత రాకూడదు..!
థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సింగరేణి సహా కోల్‌ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్ ల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపైకూడా ఆలోచనలు చేయాలన్నారు సీఎం. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయన్న సీఎం…, ఇందుకోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.