హైదరాబాద్ : బొగ్గు ఉత్పత్తిపై ఏరియాల వారీగా సింగరేణి సింగరేణి చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలో లభిస్తున్న బొగ్గు ఉత్పత్తి నిలువలు రవాణా సౌకర్యాల గురించి చైర్మెన్ అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు కు డిమాండ్ ఉన్నందున రోజువారి లక్ష్యాన్ని మించి బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలన్నారు. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ మాట్లాడుతూ తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వల కొరత లేదన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కేంద్రాల్లో సరిపడినన్ని బొగ్గు నిల్వలు సమకూర్చామని సింగరేణి అధికారులు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.