Huzurabad: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకానికి బ్రేకులు పడటంతో ఈటలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. బీజేపీ కారణంగానే ఎన్నికల సంఘం పథకాన్ని నిలిపివేసిందంటూ, నిరసనకు దిగారు దళితనేతలు. హన్మకొండ జిల్లాలోని ఉప్పల్,మర్రిపల్లిగూడెం గ్రామాలతో పాటు, కమలాపూర్‌లో ఈటల రాజేందర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ప్రధాని మోడీ, ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.