హైదరాబాద్ సిటీ/చార్మినార్‌ : ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ పేరుతో నిర్వహించిన కార్యక్రమం పాతబస్తీలోని అన్ని వర్గాల సంస్కృతి సంప్రదాయలకు విరుద్ధంగా ఉందని స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు అన్నారు. సోమవారం చత్తా బజార్‌లోని జమాత్‌ ఏ ఇస్లామీ హింద్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతి నిధులు ఖాయీముద్దీన్‌, సోహైల్‌ రిజవాన్‌, కాలేదా పర్వీన్‌, అబ్దుల్‌ ఖదీర్‌, అబ్దుల్‌ సమీ మాట్లాడుతూ ఆదివారం చార్మినార్‌ వద్ద.. ఏక్‌ చార్మినార్‌ కే నామ్‌ పేరుతో ‘సండే ఫండే’ను తలపిస్తూ నిర్వహించడం విడ్డూరమన్నారు. చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి దేవాలయం. మక్కా మస్జీద్‌, దర్గా వంటి ఆరాధన స్థలాలున్నాయని, అలాంటి ప్రాంతంలో పర్యాటకులను ఆకర్షించడానికి, వ్యాపారాలు పెంచడానికి, అన్ని వర్గాల ప్రజల సంస్కృతి సంప్రదాయలకు విరుద్ధంగా పాశ్చాత్య సంస్కృతిని పాతబస్తీ ప్రజలపై రుద్దడాన్ని అందరూ ఖండించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పునరాలోచించాలని వారు కోరారు.

By admin

Leave a Reply

Your email address will not be published.