మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ముస్లింలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్‌ ప్రవక్త పుట్టినరోజైన మిలాద్‌ ఉన్‌ నబీని భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఆకాంక్షించారు. దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వమానవ సమానత్వం, ఐకమత్యం వంటి ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు.

మహమ్మద్‌ ప్రవక్త బోధనలు అమూల్యం: పవన్‌

”మానవాళికి మహమ్మద్‌ ప్రవక్త అందించిన బోధనలు అమూల్యమైనవి. ప్రేమ, సోదరభావం, ధర్మ చింతన ప్రతి మానవుడిలో ఉండాలని చెప్పిన మహ్మద్‌ ప్రవక్త జన్మదినం మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు” అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.