ప్రజల నుండి స్పందనలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో అధికారులతో కలిసి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు ప్రతి పిటిషన్‌ను స్వయంగా పరిశీలించి సదరు సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించాలని కోరారు. సోమవారం స్పందనలో భాగంగా 160 పిటిషన్లు వచ్చాయని, వాటన్నింటిని సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు, హౌసింగ్‌ జెసి కల్పనాకుమారి, ఇన్‌ఛార్జి డిఆర్‌ఓ రంగయ్య, విశాఖ ఆర్‌డిఒ పెంచల కిశోర్‌, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.