హీరోయిన్ కీర్తిసురేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగులో రేమో సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలోనటించి మహానటి గా పేరు పొందింది. అంతేకాకుండా మహానటి సినిమా కు జాతీయ అవార్డు కూడా పొందింది. అయితే తాజాగా ఈమె యొక్క ఆస్తి విలువ ఎంత ఉందో అనే విషయం ఇపుడు ఎక్కువగా అందరినోట వినిపిస్తోంది.వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

కీర్తి సురేష్ చెన్నై లో పుట్టి పెరిగింది. ఈమె చదువు అంతా తమిళనాడులో పూర్తి చేసుకుంది. ఈమె తండ్రి కూడా ఒక సినీ ప్రొడ్యూసర్. ఈమె తల్లి కూడా ఒక హీరోయిన్. చిన్నప్పుడే కీర్తి సురేష్ బాలనటిగా కొన్ని సినిమాలలో నటించింది. ఇక తన చదువు పాడవుతుందని ఉద్దేశంతో ఆమె చైల్డ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ఇక తాజాగా ఆమె ఆస్తి ఎంత ఉందంటే కేరళలోని ఐదు కోట్ల విలువ చేసే ఒక ఇల్లు. రెండూ ఖరీదైన కార్లు. దాదాపుగా 98 కోట్ల రూపాయల వరకు ఈమె ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇక ఈమె ఒక సినిమా కోసం రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published.