క్రేజీ ప్రాజెక్ట్స్ పై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ లెవెల్ లో స్టార్ గా నిలచిన ప్రభాస్ చిత్రాలపై ఆల్ ఇండియాలో మరింత ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘సలార్’ సినిమాలోని ఓ ఫైటింగ్ సీన్ లో పది సెకండ్ల పార్ట్ లీక్ అయింది. అది వేరే ఎవరిదో అయితే అంత హంగామా సాగేది కాదనుకోండి. ‘బాహుబలి’ సీరీస్ తరువాత అంతర్జాతీయ మార్కెట్ లోనూ చోటు సంపాదించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’లోది కావడంతో సోషల్ మీడియాలో ఈ లీక్ బిట్ హల్ చల్ చేస్తోంది. పైగా ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ మూవీతో ఆల్ ఇండియాలో అలరించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాంతో ఈ లీకైన యాక్షన్ బిట్ పై మరింత ఫోకస్ సాగుతోంది. పది సెకండ్ల పాటే కనిపిస్తోన్న ఈ యాక్షన్ సీన్ ను జనం చూసి థ్రిల్ ఫీలవుతున్నారు.

అదీగాక, ‘సలార్’ పూర్తి కాగానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని వినిపిస్తోంది. ఈ మధ్యే ప్రశాంత్ నీల్ తో చిరంజీవి, రామ్ చరణ్ కలసి ఉన్న ఫోటో కూడా హల్ చల్ చేసింది. అందువల్ల ఇప్పుడు లీకైన ‘సలార్’ సినిమా పది సెకండ్ల యాక్షన్ బిట్ కు మరింత క్రేజ్ తోడయిందని చెప్పాలి. ‘బాహుబలి’ తరువాత ‘సాహో’తో జనం ముందుకు వచ్చాడు ప్రభాస్. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దాంతో మరో మూవీతో తప్పకుండా ప్రభాస్ బంపర్ హిట్ కొడతాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ జనవరిలో సంక్రాంతి కానుకగా రానుంది. ఇక ‘సలార్’ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ‘రాధే శ్యామ్’ తరువాత రానున్న ‘సలార్’లోని యాక్షన్ ఎపిసోడ్ అంటే మరి ఫ్యాన్స్ కు క్రేజ్ ఉండకుండా ఉంటుందా? అందుకే ఈ పది సెకండ్ల ఫైట్ సీన్ ను కూడా భలేగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు జనం.

By admin

Leave a Reply

Your email address will not be published.