దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీయబోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆరుసార్లు తీసిన జనాభా గణనలో కులాల వారీగా లెక్కలు తీయలేదు. కానీ, ఈసారి కులాల వారీగా లెక్కలు తీయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అన్ని పార్టీలు, బీసీ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ డిమాండ్ చేస్తున్నాయి.
ఎందుకోసం బీసీ గణన అవసరం.. ఈ రోజు ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. బీసీ జనగణన చేపట్టాలని ఆయన లేఖలో ప్రధానమంత్రి మోదీ (Prime Minister Modi) ని కోరారు. సంక్షేమ పథకాల అమలులో ఆయా వర్గాలు వెనుకబడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయని, బీసీ జనగణనపై తమ ప్రభుత్వ హయాంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చంద్రబాబు గుర్తు చేశారు. సరైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో బీసీలకు అన్యాయం జరుగుతోందని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆయా వర్గాలు ఇంకా వెనకబడే ఉంటున్నాయని ఆ లేఖలో తెలిపారు. బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయని అభిప్రాయపడ్డారు.

By admin

Leave a Reply

Your email address will not be published.