పెరుగుతున్న ధరలను నియంత్రించాలని, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని లఖీంపూర్‌ ఘటనలో నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ దేవరాపల్లి మండలంలోని రైవాడ గ్రామంలో సిపిఐ ఆధ్వర్యాన మంగళవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి గరికిన రాజు మాట్లాడుతూ, లఖీంపూర్‌ ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని వెంటనే భర్తరఫ్‌ చేయాలని, అతని కుమారుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలు అమలైతే దేశ ప్రజలందరికీ నష్టం వాటిల్లే ప్రమాదముందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.శివ, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.