జోన్‌-3 పరిధిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. అధికార పార్టీ నేతల బలం.. కొందరు అధికారుల అండదండలతో యథేచ్ఛగా భూములను ఆక్రమించి నిర్మాణాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు కాపాడాలంటూ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇచ్చే ఆదేశాలను జీవీఎంసీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. జోన్‌-3 పరిధిలో గల ఉషోదయ జంక్షన్‌ నుంచి బీచ్‌ రోడ్డుకు వెళ్లే మార్గంలో నంది గుడి సమీపంలో మా ప్రేమ సంస్థ ఉంది. ఒక అపార్ట్మెంట్‌లో ఈ సంస్థ నడుస్తోంది. అపార్ట్‌మెంట్‌కు వెనుక భాగంలో జీవీఎంసీకి సంబంధించి 88 అడుగుల స్థలం ఉంది. రూ.కోటికి పైగా విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ఎత్తులు వేశారు. దీంతో ఈ నెల 2వ తేదీన జీవీఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. కొద్ది రోజులు ఆగిన కబ్జా దారుడు ప్రస్తుతం పనులు ప్రారంభించాడు. అధికారులు అనుమతులిచ్చారంటూ కబ్జాదారుడు చెప్పడం కొసమెరుపు. ‘మా స్థలం కాకపోతే భూమి రిజిస్ట్రేషన్‌? ఎలా అవుతుందని, మున్సిపాలిటీ అధికారులు ఇంటి నెంబర్‌ ఎలా ఇస్తారంటూ’ కబ్జా రాయుళ్లు ఎదురు ప్రశ్నిస్తుండటం గమనార్హం. గతంలో అక్రమ నిర్మాణం అని అడ్డుకున్న అధికారులు ఇప్పుడెలా అనుమతులిచ్చారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.