విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం అవసరం ఉందని విశాఖ రేంజ్‌ డిఐజి ఎల్‌కెవి రంగారావు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాలో 2016లో 2,290 మంది, 2017లో 2,406 మంది, 2018లో 2,174 మంది, 2019లో 2,565, 2020లో 2,000 మంది, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4,059 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ, ఇతర రాష్ట్రాల పోలీసులు స్థానిక పోలీసు సహకారం తీసుకున్నట్లు తెలిపారు. గాలిపాడు నిందితుల్ని పట్టుకునేందుకు స్థానిక పోలీసు సహకారం తీసుకోలేదని, పోలీస్‌ వాహనంపై స్థానికుల దాడితో నల్గొండ పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. రూరల్‌ ఎస్‌పి బి.క్రిష్ణారావు మాట్లాడుతూ నల్గొండ పోలీసులు జరిపిన కాల్పులపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.