సమయం, సందర్భాన్ని బట్టి తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నారు. ఆయనకు ఉప రాష్ట్రపతి పదవి అనేది వాట్సప్ యూనివర్సిటీ ప్రచారమే తప్ప నిజం లేదని చెప్పారు. ప్రపంచంలోని అతి గొప్ప పథకాల్లో ఒకటైన దళితబంధును ఆపడం ఎవరి తరం కాదన్నారు. నవంబరు 3 తర్వాత అది రాష్ట్రమంతటా యథాతథంగా కొనసాగుతుందన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.