దళితబంధు పథకాన్ని భాజపా, తెరాసలు వ్యూహాత్మకంగానే నిలిపేశాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్‌కు ముందే అమలైన పథకాన్ని కొనసాగించాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌లు కేంద్ర ఎన్నికల అధికారిని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉల్లంఘనలపై మంగళవారం ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీల వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్తానని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పటివరకు ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. కేటీఆర్ అన్నివిధాలా తనకంటే జూనియర్ అని, ఆయనతో ఏ విషయంలోనైనా చర్చకు సిద్ధమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నవంబరు 15 లోగా చర్చకు రావాలని సవాలు విసిరారు.