తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కాజేసిన కేసులో పదహారో నిందితుడు కృష్ణారెడ్డిని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. తెలుగు అకాడమీకి చెందిన రూ.65.05కోట్ల ఎఫ్‌డీలను కొల్లగొట్టిన సాయికుమార్‌ ముఠాలో ఇతడు కీలకపాత్ర పోషించాడు. తనవాటాగా రూ.6 కోట్లు తీసుకున్నాడు. పోలీసులు సాయికుమార్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలుసుకున్న కృష్ణారెడ్డి కొద్దిరోజుల క్రితం పారిపోయాడు. అతడి కదలికలపై నిఘా ఉంచి మియాపూర్‌లో అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ మనోజ్‌ కుమార్‌ తెలిపారు.

సాయికుమార్, డాక్టర్‌ వెంకట్, నండూరి వెంకటరమణలతో కృష్ణారెడ్డికి మూడేళ్ల నుంచి స్నేహం ఉందని, రియల్‌ వ్యాపారాలు నిర్వహించాడని ఏసీపీ వివరించారు. తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను సొంతానికి వినియోగించుకుంటున్న సమయంలోనే… సాయికుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ గిడ్డంగుల సంస్థ, ఆయిల్‌సీడ్స్‌ సంస్థలపై కన్నేశాడు. ఆరునెలల క్రితం ఆ సంస్థల్లోని నిధులు కాజేయాలని పథకం వేశాడు.

By admin

Leave a Reply

Your email address will not be published.