భారత్‌ మరో అధ్యాయం లిఖించింది. కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమం గురువారం వంద కోట్ల డోసుల మైలురాయిని అధిగమించింది. జనవరి 16న మొదలైన ఈ ప్రస్థానం… 279వ రోజున శతకోటి మలుపు చేరుకొంది. దీంతో నిత్యం సగటున 35,84,223 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించినట్టయింది. ఇప్పటివరకూ సుమారు 70% మందికి ఒక డోసు, 31% మందికి రెండు డోసులు పూర్తయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం… దేశంలో కొవిడ్‌ టీకా పొందేందుకు అర్హులైనవారి జనాభా 94,47,09,596. వీరందరికీ మొత్తం 188,94,19,192 డోసులు ఇవ్వాలి. ఈ లెక్కన ఇంకా 47.07% దూరం ప్రయాణించాల్సి ఉంది. దేశంలో అత్యధిక టీకాలు అందించిన తొలి ఐదు రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లు నిలిచాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంలో, తెలంగాణ 13వ ర్యాంకులో ఉన్నాయి

By admin

Leave a Reply

Your email address will not be published.