ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విశాఖ పర్యటన దాదాపు ఖరారైంది. ఈ నెల 23న మధ్యాహ్నం 3గంటలకు విశాఖ ఎయిర్‌ పోర్టుకు చేరుకోనున్నారు. ఆ తర్వాత ఎన్‌ఎడి వద్దకు చేరుకుని విఎంఆర్‌డిఎ ఆధ్వర్యాన నిర్మితమైన ఫ్లై ఓవర్‌ను సాయంత్రం 5గంటలకు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఉడా పార్కుకు చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన పార్కును ప్రారంభిస్తారు. సాయంత్రం 6నుంచి 7 గంటల మధ్యలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె స్వాతి శ్రీవిద్య వివాహానికి హాజరవుతారు. విశాఖలోని ఎంజిఎం పార్కు (న్యూ పార్క్‌ హోటల్‌)లో ఈ వివాహం జరుగుతుంది. ఆ తర్వాత విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని తాడేపల్లిలోని నివాసానికి వెళతారు.

By admin

Leave a Reply

Your email address will not be published.