రాష్ట్ర తొలి ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కుంభా రవిబాబుకు గిరిజన ప్రజానీకం, ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు. ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా అరకులోయ విచ్చేసిన చైర్మెన్‌ రవిబాబుకు అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఆధ్వర్యాన స్థానిక పున్నమి అతిథి గృహంలో అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ వెబ్‌ సైట్‌ నుంచి గిరిజన తెగలను ఒక్కొక్కటిగా తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొదటగా ఎస్‌టి వాల్మీకి, తర్వాత భగత, ఇప్పుడు గౌడు తెగలను తొలగించిన విషయం తన దృష్టికి రావడంతో గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నివేదిక కోరినట్లు తెలిపారు. తొలగింపుపై షోకాజు నోటీసు ఇచ్చామని, టెక్నికల్‌ ఎర్రర్‌ వల్ల ఈ సమస్య ఏర్పడిందని నివేదిక సమర్పించారని రవిబాబు చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published.