గ్రామ సచివాలయాల మహిళా పోలీసులు గ్రామాలను పర్యవేక్షించాలని అనకాపల్లి డిఎస్పి సునీల్ సూచించారు. చోడవరం సర్కిల్ పరిధిలో ఉన్న గ్రామ సచివాలయ మహిళ పోలీసులకు అవగాహన సదస్సు గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా పోలీసులకు గ్రామాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. నిరంతర పర్యవేక్షణ ఉన్నప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉండదని ఆయన తెలిపారు. చట్టాలపై అవగాహన కలిగి శాంతి భద్రతలు కాపాడటంలో కీలక భూమిక పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ సయ్యద్ ఇలియాస్ మహమ్మద్, స్థానిక ఎస్సై విభూషణరావు, ఎస్ఐ పాల్గొన్నారు.