జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలోగల ఎస్‌సి పండ్ల వర్తకులకు ప్రయోజనం కలిగే విధంగా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగంలో ఏర్పాటు చేసిన కోల్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యాన్ని గీతం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం సామాన్య ప్రజలకు చేరే విధంగా భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం (డిఎస్‌టి) గీతంకు సహకారం అందించటం అభినందనీయమన్నారు. బయోటెక్నాలజీ విభాగం ద్వారా ఇప్పటికే పలు ప్రయోజనాత్మక ప్రాజెక్టులను ప్రజలకు అందించామని, ప్రస్తుతం పండ్ల వర్తకులకు ఉపయోగపడే స్టోరేజ్‌, ప్రాసెసింగ్‌ యూనిట్లను గీతంలో ఏర్పాటు చేయడానికి డిఎస్‌టి ముందుకు వచ్చిందని అన్నారు. ఎక్కువ మంది పండ్ల వర్తకులకు, చిరు వ్యాపారులకు ప్రయోజనం అందేలా బయో టెక్నాలజీ విభాగం కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు

By admin

Leave a Reply

Your email address will not be published.