తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం అయినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. ఏలాంటి ఇబ్బందులు లేకుండా చీరల పంపీణీ కార్యక్రమం పూర్తి అయ్యేలా అన్నిచర్యలు తీసుకున్నామన్నారు మంత్రి. 18 సంవత్సరాలు నిండి, ఆహార భద్రత కార్డ్ కింద నమోదైన అర్హూలైన ప్రతి ఒక్క ఆడబిడ్డకు బతుకమ్మ చీర అందాలని సూచించారు. ప్రభుత్వ పథకంతో రాష్ట్రంలోని అడబిడ్డలకు అందమైన చీరతోపాటు, నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు మంత్రి. 2017 నుంచి గత ఎడాదిదాకా మూడు కోట్ల 90 లక్షల చీరలను పంపీణీ చేసినట్లు తెలిపారు. ఈసారి 333.14 కోట్లతో ఒక కోటి 8 లక్షల చీరలు సిద్దం చేసినట్లు పేర్కొన్నారు . ఈ సంవత్సరం 30 సరికొత్త డిజైన్లలో, 20 విభిన్న రంగులతో కలిపి మొత్తం 810 రకాల చీరల తయారీ చేసారు. రాష్ట్రంలో పవర్ లూమ్ పరిశ్రమ బలోపేతానికి ఈ కార్యక్రమం నాంది పలికింది. గత నాలుగేళ్లలో నేతన్నల అదాయం, నైపుణ్యం పెరిగిందన్న మంత్రి. రానున్న రోజుల్లో మరిన్ని డిజైన్లు, ఇతర వస్త్రాలను ఉత్పత్తి చేసే దిశగా రాష్ట్రంలోని పవర్ లూమ్ కార్మికులు సిద్ధమవుతున్నారు అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.