హైదరాబాద్: నగరంలోని చందానగర్లో విశాఖ శ్రీశారదా పీఠం ఆద్వర్యంలో కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర దేవాలయ సముదాయాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సందర్శించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ రజతోత్సవాలు జరుగుతున్న నేపధ్యంలో గవర్నర్ ఆలయానికి తరలి వచ్చారు. ఈసందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి గవర్నర్ను సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళి సై ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి స్వాముల వారు గవర్నర్కు జ్ఞాపికను బహుకరించారు.