రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి ఓటు వేసే పరిస్థితి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. బద్వేలు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బద్వేల్ నీటి సమస్యపై బహిరంగ చర్చకు సిద్ధం. టీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ట్యాంకర్లతో నీళ్లు తోలారు. మా ప్రభుత్వం వచ్చాక బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సమృద్ధిగా నీరు అందిస్తున్నాం. బద్వేల్ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ చిత్తశుద్ధితో ఉంది.

బీజేపీకి ఓటు వేస్తే చెల్లని ఓటుగా మిగులుతుంది. వైఎస్సార్‌సీపీని విమర్శించడమే అజెండాగా బద్వేల్ ఎన్నికలను బీజేపీ వాడుకుంటోంది. కేంద్ర నిధులు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఉపఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిస్తే ఆరోపణలు చేసేందుకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే పోరాటం చేస్తుంది. మీలాగా రోజుకో పార్టీతో కాదు. టీడీపీ వాళ్లపై ఆధారపడి ఎన్నికల్లో ఉనికిని కాపాడుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.