ప్రభుత్వ వెబ్ సైట్లలోని షెడ్యూల్డ్ ట్రైబ్ జాబితా నుంచి వాల్మీకి, భగత, గౌడు ఉప తెగలను తొలగించడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు పాల్పడిన వారిపై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఇతర సమస్యలను పరిష్క రించాలని కోరుతూ గిరిజన సంఘం, అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన చలో ఐటిడిఎ విజయవంతమైంది. వందలాదిగా తరలివచ్చిన ఆదివాసీలు ఐటిడిఎ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స, ఉపాధ్యక్షుడు కిల్లో సురేంద్ర, జిల్లా అధ్యక్షులు పాలిక లక్కు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొండ తౌడన్న, జిల్లా అధ్యక్షుడు కోరాబు సత్యనారాయణ, అనంతగిరి సిపిఎం జెడ్పిటిసి డి.గంగరాజు తదితరులు మాట్లాడుతూ గిరిజన ప్రజాప్రతినిధుల చేతగానితనంతో తెగల తొలగింపు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాల్మీకి, భగత, గౌడు తెగలను ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి తొలగించి రాజ్యాంగ ధిక్కారానికి పాల్పడిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోవడంలో జాప్యమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు