మధ్యాహ్నం భోజనం నిర్వహణ పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వంట నిర్వాహకులు అశ్రద్ధ చేస్తే చర్యలు తీసుకుంటామని మధ్యాహ్న భోజన పథకం ఏడిఎం రామరాజు హెచ్చరించారు. మండలం లోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యా యులతో శుక్రవారం వెలుగు కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధ్యాహ్న భోజనం పథకం అమలును చిత్తశుద్ధితో బాధ్యతగా నిర్వహిం చాలన్నారు. నిర్వహణ సక్రమంగా లేకుంటే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని పేర్కొన్నారు. ఆడపిల్లలకు నేప్కిన్లు పంపిణీలో ఇన్సులేటర్‌ తప్పక వాడాలన్నారు. పాఠశాలలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం దేవరాపల్లి, కాశీపురం హైస్కూల్‌లలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆయా పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం నిర్వహణను పరిశీలించారు. ఆయన వెంట మండల విద్యాశాఖ అధికారి సిహెచ్‌ రవీంద్రబాబు, టీఎంఎఫ్‌ కోఆర్డినేటర్‌ సత్యనారాయణ ఉన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.