‘హలో! కెజిబివి (కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం) నుంచి మాట్లాడుతున్నామండి. స్కూలింకా తెరవలేదు. ఎప్పుడు తెరుస్తామనేది చెబుతాం. అంతవరకు స్కూల్‌కు పంపించకండి. మేము చెప్పిన తరువాత మీ అమ్మాయిని పంపించండి. వుంటామండి. థ్యాంక్సండి.’ విశాఖ జిల్లాలోని కెజిబివిల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు సిబ్బంది నుంచి వెళ్తున్న ఫోన్‌ కాల్స్‌ ఇవి. పేద బాలికల విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కెజిబివిలకు సరఫరాదారులు సరుకులు సరఫరా నిలిపివేయడంతో వంటకు సరుల్లేక పిల్లలను స్కూళ్లకు అందాక పంపించొద్దని తల్లిదండ్రులకు సిబ్బంది ఫోన్‌ చేస్తున్నారు. దసరా సెలవులు ముగిసి, పాఠశాలల తెరిచి శుక్రవారం నాటికి ఐదు రోజులవుతున్నా కొన్ని కెజిబివిలు తెరవలేదు. పై అధికారుల ఒత్తిడితో తెరిచిన విద్యాలయాల్లో సరుకుల్లేక మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. కెజిబివిలకు సరుకులు సరఫరా చేసే సరఫరాదారులకు గతేడాది నవంబరు నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఈ సమస్య ఎదురైంది.

By admin

Leave a Reply

Your email address will not be published.