వైజాగ్ స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోరుతూ నవంబర్ 1న విశాఖ విద్యార్థి, యువజన జెఎసి ఆధ్వర్యాన విశాఖ నగరంలోని ఎవిఎన్ కళాశాల నుంచి జరిగే ర్యాలీని, పాత పోస్టాఫీసు వద్ద నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలంటూ శుక్రవారం గాజువాక న్యూ ఐటిఐ వద్ద పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఎల్జె.నాయుడు, డివైఎఫ్ఐ నగర అధ్యక్షులు కె.మహేష్ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే రిజర్వేషన్లు అమలవుతాయని, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని అన్నారు. వాటి రక్షణ కోసం విద్యార్థులంతా కంకణబద్ధులు కావాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గుణ, శ్రావణి పాల్గొన్నారు.