అమరావతి: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. పట్టాభిరామ్‌ ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయవాడ గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో బుధవారం రాత్రి విజయవాడ పటమటలోని ఆయన ఇంటివద్ద పోలీసులు హైడ్రామా నడుమ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం పట్టాభిని విజయవాడ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అదే రోజు రాత్రి మచిలీపట్నం జైలుకు తరలించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించిన అనంతరం మరుసటి రోజు అక్కడి నుంచి రాజమహేంద్రవరం జైలు తరలించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.