తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. కరోనా నేపథ్యంలో గతంలో వాయిదా పడిన పరీక్షలను నేడు ప్రారంభించిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధల ప్రకారం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు 1,768 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,59,228 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించనుంది. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.