కీస‌ర మండ‌లం యాదగిరిపల్లి వ‌ద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన షిఫ్ట్‌ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో హైదరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ సతీమణి శంకరమ్మ, మరదలు ఉన్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

By admin

Leave a Reply

Your email address will not be published.