హైదరాబాద్ : దళిత బంధు ప్రకటించాక ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని ఏపీ నుంచి విజ్ఞాపనలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధ్యక్షుడు ఏపీ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. తాజాగా మంత్రి వద్ద విలేకరులు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయా..? అని ప్రశ్నించారు. ఒకేసారి లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశామని..

తెలంగాణలో చేశారా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ సంక్షేమాన్ని చూసి తాము నేర్చుకోవాలో చెప్పాలన్నారు. ఉపఎన్నికల కోసం ఒక్క నియోజకవర్గంలో 10 లక్షలు పంచుతున్నారని..

కానీ ఏపీలో అలా చేయలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పథకాలు అమలుచేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో అమ్మ ఒడి, నాడు- నేడు, పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారా..? అంటూ ప్రశ్నించారు. ఇంకా జగన్ తెలంగాణ వస్తారని వాళ్లు ఆలోచించాలి గానీ.. వాళ్లు ఏపీకి వస్తారని మేం ఆలోచించనక్కరలేదు అంటూ వ్యాఖ్యానించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.