పార్టీని స్థాపించిన 20 ఏండ్ల ప్రస్థానంలో అనేక విజయాలు, అనేక అద్భుతాలను సృష్టించిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని పద్మారావునగర్‌ ఇన్‌చార్జి గుర్రం పవన్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం పద్మారావునగర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. సీనియర్‌ పార్టీ కార్యకర్త అమృతమ్మ చేతుల మీదుగా కేక్‌ కట్‌ చేయించారు. మహిళలు బతుకమ్మ ఆడి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అనేక పోరాటాల ఫలితంగా లక్షలాది మంది ప్రజల చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు.

పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచుల పెండ్లికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ కింద రూ.లక్షా 116 వేల ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.ఐదు వేలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్‌లను అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం ప్లీనరీ వేదిక హై టెక్స్‌కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహేష్‌, రాజు, శ్రీకాంత్‌ రెడ్డి, విజయ ౌదరి, కౌసల్య, దుర్గ, అనిత, యూత్‌ అధ్యక్షుడు వెంకటేష్‌, బాల్‌ రెడ్డి, చక్రధర్‌, సుధాకర్‌ రెడ్డి, కుషాల్‌, తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.