అ శోక్‌ గల్లా హీరోగా శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘హీరో’. అమర రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మించారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. జిబ్రాన్‌ స్వరాలందించారు. ఈ సినిమాలోని తొలి గీతాన్ని నటుడు రానా సోమవారం విడుదల చేశారు. ”అచ్చ తెలుగందమే.. నీలా కలిసే” అంటూ సాగుతున్న ఈ మెలోడీ గీతానికి రామజోగయ్య శాస్త్రి స్వరాలందించగా.. సిధ్‌ శ్రీరామ్‌, అనుదీప్‌ దేవ్‌, నమిత బాబు సంయుక్తంగా ఆలపించారు. ”సరికొత్త కథాంశంతో చక్కటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. ” అని చిత్ర బృందం తెలియజేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.