చోడవరం(అనకాపల్లి జిల్లా): అనుభవజ్ఞుడికి సముచిత స్థానం లభించింది. ఆయన సేవలకు తగిన గుర్తింపు దక్కింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ప్రభుత్వ విప్‌గా నియమించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చోడవరం నియోజకవర్గంతోపాటు అనకాపల్లి జిల్లాలో అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు.