విజయవాడ: టీడీపీ హయాంలో కాఫర్‌ డ్యామ్‌ కట్టకుండా డయాఫ్రమ్‌ వాల్‌ను కట్టారని ఇదే డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి కారణమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ హయాంలో చేసిన ఘోర తప్పిదాల కారణంగానే పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని మంత్రి మండిపడ్డారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఉమ నోరు అదుపులో పెట్టుకోవాలి
టీడీపీ నేతలు నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకోవాలి. టీడీపీ తెలివి తక్కువతనం వల్ల లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌ మునిగి పోయింది నిజం. ప్రపంచంలో ఎవరూ చేయని తప్పులు టీడీపీ చేసింది.  చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే  డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయింది. స్పిల్‌ వే ఆపేసి డయా ఫ్రమ్‌ వాల్‌ ఎలా కట్టారు. రూ. 400 కోట్లతో కట్టిన డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయింది’ అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.

వరద తగ్గాక ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు వెళుతున్నాడు
వరద తగ్గాక ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు వెళుతున్నాడు.తెలంగాణ మంత్రులు పోలవరం పై మాట్లాడుతున్నారు. దీని వలన నష్టం జరుగుతుందని చెప్పడం అవాస్తవం. అన్ని అంశాలు పరిశీలించాకే డిజైన్ల కు ఆమోదం తెలిపారు. పోలవరం ముంపు మండలాలను అందుకే ఏపీలో కలిపారు. పోలవరం వలన తెలంగాణకి ఎలాంటి నష్టం రాదు. టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్న కి కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.