నాగోలు: అనేక ప్రశ్నలు.. ఎన్నో అనుమానాల బాలిక వర్షిత మృతి కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆరో తరగతి విద్యార్థిని వర్షిత నాలుగో అంతస్తుపై నుంచి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎల్‌బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బాలిక మృతి పట్ల వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఆయన చెప్పారు. బాలికను తీసుకువచ్చిన ఆటో డ్రైవర్‌ దుర్గేష్‌ను విచారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏసీపీ కథనం ప్రకారం వివరాలు.. మన్సురాబాద్‌లోని మధురానగర్‌లో కాలనీ రోడ్డు నంబర్‌– 5లో ఉంటున్న  సత్యనారాణరెడ్డి, ప్రభావతి దంపతుల కూతురు వర్షిత.

By admin

Leave a Reply

Your email address will not be published.