హైదరాబాద్ : ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్-2 మ్యాచ్‌లో స్కాట్లాండ్పై అఫ్ఘనిస్తాన్భారీ విజయం సాధించింది. ముందుగా అఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు.. నజీబుల్లా (59, 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), గుర్బాజ్ (46, 37 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు), జాజారు (44, 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు చెలరేగటంతో తొలుత అఫ్ఘనిస్తాన్ 191/4 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం అఫ్ఘన్ టాప్ క్లాస్ బౌలర్లు రషీద్ ఖాన్ (4/9), ముజీబ్ రెహమాన్ (5/20)ల దెబ్బకు స్కాట్లాండ్ 60 పరుగులకే కుప్పకూలింది. 10.2 ఓవర్లలోనే స్కాట్లాండ్ను అఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు చుట్టేయడంతో 131 పరుగుల తేడాతో అఫ్ఘన్ జట్టు విజయం సాధించింది.