హైదరాబాద్‌: నకిలీ డాక్యుమెంట్లతో గ్రానైట్‌ కటింగ్‌ మిషన్‌ కోసం బ్యాంకు రుణం తీసుకొని ఎగ్గొట్టిన వారిపై సీసీఎస్‌లో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. కెనరా బ్యాంకు నుంచి ఓమ్‌ సాయి ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని అద్లురీ రాజు బాలానగర్‌ కెనరా బ్యాంకులో రూ. 95 లక్షల రుణం కోసం దరఖాస్తు చేశాడు. తన వ్యాపార కార్యాలయం పంజాగుట్ట ద్వారాకపూరి కాలనీలో శ్రీదేశి అపార్టుమెంట్‌లో ఉందని సంబంధింత పత్రాలు బ్యాంకుకు అందించాడు.

అనంతరం రూ. 95 లక్షల రుణం బ్యాంకు మంజూరు చేసింది. తరువాత కొన్ని వాయిదాలు చెల్లించి చేతులెత్తేశాడు. వాయిదాలు సక్రమంగా రాకపోవడంతో ఎందుకు చెల్లించడం లేదని, కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ అతని కార్యాలయమే లేదని తేలింది. అతడి వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, కోటేషన్లు కూడా నకిలీవని తేలాయి.

ఒక పథకం ప్రకారం బ్యాంకును మోసం చేసి రూ. 89 లక్షల వరకు నష్టం చేశారంటూ కెనరా బ్యాంకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ సీసీఎస్‌ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో అద్లురీ రాజుతో పాటు అతనికి సహకరించిన నరహరి గంటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

By admin

Leave a Reply

Your email address will not be published.