పలుచోట్ల సోదాలు గుట్కాలు అమ్మే స్తావరాలపై దాడులు సరుకు స్వాధీనం
సింగరాయకొండ, శానంపూడిలో కేసులు నమోదు
గుట్కా లు విక్రయించినా, నిల్వలు ఉంచినా కఠిన చర్యలు
ఎస్సై ఫిరోజ ఫాతిమ హెచ్చరిక
సింగరాయకొండ,జూలై 22,
ప్రజల ఆరోగ్య భద్రత లో భాగంగా సింగరాయకొండ లో ప్రభుత్వం నిషేధించిన పొగాకు ఉత్పత్తులు,గుట్కా ల నిల్వలు విక్రయాల పై సింగరాయకొండ ఎస్సై తమ సిబ్బంది తో సింగరాయకొండ, శానంపూడిలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం నిషేధించిన పొగాకు ఉత్పత్తులు వాడకం హానికరమని ప్రచారం చేస్తున్న వివిధ మార్గాల ద్వారా తెచ్చి బ్యాంకులు,చిన్నచిన్న దుకాణాల ద్వారా విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని ఆమేరకు చేపట్టిన తనిఖీల్లో ఇద్దరి సంబంధించిన గుట్కా పాకెట్లను పోలీస్ లు స్వాధీనం చేసుకోవడం తో పాయి శానం పూడి లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి నుండి మద్యం సీసాలు స్వాధనం చేసినట్లు ఎస్సై ఫిరోజ ఫాతిమ తెలిపారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడయినా నిషేధిత గుట్కా లు పొగాకు ఉత్పత్తులు నిల్వ చేసిన విక్రయించినా, అక్రమ మద్యం విక్రయాలు పాల్పడినా చర్యలు తప్పవని ఎస్సై ఫాతిమ హెచ్చరించారు. సింగరాయకొండ, శానంపూడి లలో జరిపిన సోదాల్లో ఎ ఎస్సైలు మహబూబ్ బాషా, బెగ్, సిబ్బంది పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.