విశాఖ నగరం, జ్ఞానాపురంలోని ఎంతో ప్రతిష్టాత్మక సేక్రాడ్‌ హార్ట్స్‌ ఎయిడెడ్‌ బాలికోన్నత పాఠశాల (సెయింట్‌ పీటర్స్‌ పాఠశాల) మూసివేతపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఎంతో మంది పేద విద్యార్థినులకు విద్యనందిస్తున్న ఈ పాఠశాల మూసివేతతో తమ పిల్లల భవిష్యత్‌ ఏమిటంటూ వారంతా ఉదయం నుంచి 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జ్ఞానాపురం మెయిన్‌ రోడ్డుపై రాస్తారోకో చేపట్టి రహదారిని దిగ్బంధించారు. ఆడపిల్లల చదువంటే ఇంత అలుసా? అంటూ విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వ విధానంపై నిరసన వ్యక్తమైంది.

By admin

Leave a Reply

Your email address will not be published.