తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరుస్తున్నామని  మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇంటింటికీ రేషన్‌ బియ్యం కార్యక్రమాన్ని ఎత్తేస్తున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టపరుస్తూ ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని తలపెట్టింది. అర్హత ఉన్న వాళ్లందరికీ రేషన్‌ఇస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 4.23 కోట్ల మంది లబ్ధిదారులు దీని నుంచి లబ్ధి పొందుతున్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నాం. ప్రపంచంలోనే కోవిడ్‌ నుంచి విపత్తు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని ద్వారా అదనంగా 2.68 కోట్ల మందికి రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. మన రాష్ట్రంలో 4.23 కోట్లు ఉంటే గరిబ్‌ హఠావో కార్యక్రమంలో 2.68 కోట్ల మందికి మాత్రమే ఇస్తున్నారు. మనం అందనంగా కోటి 60 లక్షల మందికి ఇస్తున్నాం. మన రాష్ట్రంలో ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2022 వరకు ఈ పథకాన్ని  కేంద్రం ఇస్తున్న రేషన్‌తో పాటు మేం 4.23 కోట్ల మందికి అందిస్తున్నాం. గత మూడు నెలలుగా ఒక ఆలోచన చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోంది. అనాదిగా, ఆచారంగా వస్తున్న పౌరసరఫరా వ్యవస్థను మొత్తం జనాభాలో 95 శాతం మందికి రేషన్‌ ఇస్తున్నారు. కేంద్రం ఇస్తున్న రేషన్‌ను ఉపయోగించుకోవాలని, లబ్ధిదారులకు ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ ఓ ఆలోచన చేసి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని సూచన చేయమన్నారు. లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం అర్హులందరికీ బియ్యం అందిస్తున్నాం.

By admin

Leave a Reply

Your email address will not be published.