అమరావతి: ముఖ్యమంత్రి వైయ‌స్‌  జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి పుట్టి, రాష్ట్రంలో రెండేళ్లుగా విజయవంతంగా అమలవుతున్న వైయ‌స్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సాంకేతికత అంతర్జాతీయంగా ఖ్యాతి గడిస్తోంది. ఆర్బీకే వ్యవస్థను ఇప్పటికే పలు రాష్ట్రాలు అమల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఆసియా–ఫసిపిక్‌ రీజియన్‌ సమ్మిట్‌లో రాష్ట్రంలోని ఆర్బీకే సాంకేతికతను కేంద్రం సిఫారసు చేసింది, దీంతో ఆర్బీకే వ్యవస్థ దేశ ఎల్లలు దాటింది. ఈ సాంకేతికతపై విదేశాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు ఆఫ్రికన్‌ దేశమైన ఇథియోపియా ఆర్బీకే తరహా సేవలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కోరింది.

ఆ దేశం వచ్చే పదేళ్లలో ఏటా 6.2 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఉంది. ఇందుకోసం రైతుల్లో నైపుణ్యం పెంపు, ఉత్పత్తి వ్యయం తగ్గింపు, దిగుబడుల నాణ్యతపై దృష్టి పెట్టింది. ఆ దేశ అభ్యర్థన మేరకు ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య నేతృత్వంలో జాతీయ స్థాయి బృందం ఇథియోపియా వెళ్తోంది. ఈ బృందంలో కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, భారత్‌లోని వరల్డ్‌ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు, తమిళనాడు వ్యవసాయ వర్సిటీ వీసీ సభ్యులుగా ఉంటారు.

By admin

Leave a Reply

Your email address will not be published.