అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా:  వ‌ర‌ద బాధితుల‌కు అన్ని విధాల అండ‌గా ఉంటాన‌ని..ఏ ఒక్క‌రూ అధైర్య ప‌డొద్ద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా క‌ల్పించారు. కోనసీమ జిల్లాలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా లెక్క చేయకుండా సీఎం వైయస్‌ జగన్‌ పర్యటిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులలోనూ కొనసాగుతున్న సీఎం  వైయస్‌ జగన్‌ పర్యటన. నీట మునిగిన పంట నష్టాన్ని బాధితులను అడిగి తెలుసుకుంటున్న సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.

ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలోనే వరద బాధితులకు వద్దకు సీఎం వైయ‌స్ జగన్‌ చేరుకొని.. పరామర్శిస్తున్నారు. ఇందుకోసం సీఎం వైయ‌స్‌ జగన్ పంటిపై, ట్రాక్టర్ పై పయనిస్తున్నారు. ప్రస్తుతం వైయ‌స్ జగన్ గంటి పెద‌పూడి గ్రామంలో ప‌ర్య‌టిస్తున్నారు.  అనంతరం పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశంకానున్నారు. బాధితులతో సీఎం వైయ‌స్‌ జగన్‌ నేరుగా మాట్లాడి.. పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. వరదల్లో నేను వచ్చి ఉంటే అధికారులు నా చుట్టూ తిరిగేవారు. అధికారులకు వారం రోజులు టైం  ఇచ్చి నేను ఇక్కడికి వచ్చానని చెప్పారు.  ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలన్నారు. వరద బాధితులకు అండగా నిలిచామని చెప్పారు.

జి.పెదపూడి గ్రామానికి అవసరమైన బ్రిడ్జిని నిర్మిస్తాం- వైయ‌స్ జగన్
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక గ్రామంలో సీఎం వైయ‌స్  జగన్ ఇంటింటికి తిరిగి వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులందరినీ ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని సీఎం వైయ‌స్ జగన్ తెలిపారు. ఏ వరద బాధితుడికి సహాయం అందలేదనే మాట రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గంటి పెదపూడి లంక గ్రామానికి అవసరమైన బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. ఏ సీజన్ లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఆ సీజన్‌లోనే పరిహారం అందజేస్తామన్నారు. పశువులకు ఎటువంటి కష్టం రాకుండా చర్యలు చేపడతామన్నారు. గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయిస్తానని సీఎం వైయ‌స్ జగన్ హామీ ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.