కోన‌సీమ‌: గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాకు చేరుకున్నారు. ఉద‌యం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలోని పి.గ‌న్న‌వ‌రం మండ‌లం జి.పెద‌పూడి చేరుకున్నారు. పెద‌పూడిలో భారీ వ‌ర్షం కురుస్తున్న‌ప్ప‌టికీ వ‌ర్షంలోనే వ‌ర‌ద బాధితుల వ‌ద్ద‌కు సీఎం చేరుకున్నారు. గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముచ్చ‌టించారు. వ‌ర‌ద‌ల వ‌ల్ల క‌లిగిన న‌ష్టం, ప్ర‌భుత్వం చేప‌ట్టిన స‌హాయ‌క కార్య‌క్ర‌మాల గురించి నేరుగా బాధితుల‌నే అడిగి తెలుసుకున్నారు.. అనంత‌రం పెద‌పూడి ఫెర్రీ నుంచి పంటుపై లంక గ్రామాల‌కు చేరుకున్న సీఎం.. వ‌ర‌ద బాధితుల‌ను క‌లుసుకొని.. వారిని ప‌రామ‌ర్శించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.