కోనసీమ జిల్లా: వరద నష్టంపై అంచనాలు పూర్తికాగానే ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందిస్తామని తెలిపారు. గతంలో ఏనాడూ లేని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంకలో వరద బాధితులను నేరుగా కలిసి పరామర్శించారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.