హైదరాబాద్‌: నగరాన్ని వరుణుడు వీడడం లేదు. అనూహ్యంగా.. గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో.. నగరం అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు, చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. నగరంలోనే కాదు.. శివారుల్లోనూ వాగులు, వంగులు పొంగిపోర్లుతుండడంతో రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది.

జంట నగరాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. చాలా చోట్ల నీటి తొలగింపు సమస్యగా మారి.. ట్రాఫిక్‌ చిక్కులు ఎదురవుతున్నాయి. వికారాబాద్‌, శంకర్‌పల్లిలో భారీగా వర్షం కురుస్తుండడంతో.. గండిపేట జలాయశానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. తాండూరు-వికారాబాద్, పరిగి-వికారాబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు.

By admin

Leave a Reply

Your email address will not be published.