అల్లూరి జిల్లా: ‘‘నేను రాసిస్తా.. మానవత్వం మన ప్రభుత్వంలో మానవత్వం ఉన్నంతగా ప్రపంచంలో ఎక్కడా, ఏ ప్రభుత్వానికి లేదు. ఆ లెవల్‌లో మానవత్వం ఉన్న ప్రభుత్వం మనది. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వను, అందరికీ న్యాయం చేస్తా.. మంచి చేసేందుకే మన ప్రభుత్వం ఉన్నది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కుయుగురు గ్రామంలో గోదావరి వరద బాధితులను సీఎం వైయస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వరద నష్టం అంచనా మొదలుపెడుతున్నామని, రెండు నెలల్లో పరిహారం అందరికీ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎవ్వరికీ ఎలాంటి నష్టం (పంట, ఇల్లు, పశువులు) జరిగినా ఆదుకునేందుకు ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.