మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధి వేర్వేరు చోట్ల ఓ మహిళ సహా ముగ్గురు అదృశ్యమయ్యారు. పోలీసుల కథనం ప్రకా రం.. మల్కాజిగిరి మిర్జాలగూడకు చెందిన లింగాల మౌ నిక (30) ప్రైవేటు ఉద్యోగి. భర్త భూమయ్య కూర గాయల వ్యాపారి. మౌనిక ఎక్కువగా సెల్ఫోన్లో మాట్లాడుతుండగా, భర్త మందలించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 1న ఉద్యోగానికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. భర్త ఫోన్ చేయగా, స్విచ్చాఫ్ చేసి ఉంది. కార్యాలయానికి ఫొన్ చేయగా, విధులకు రాలేదని చెప్పారు. దీంతో మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఉత్తంనగర్కు చెందిన దోండోపంత్ విఠల్రావు వాసుదేవ న్ (66) గత నెల 22 నుంచి కనిపించడం లేదు. గతంలోనూ ఇదే విధంగా వెళ్లి తిరిగి వచ్చేవాడని, ఈసారి రాకపోవడంతో కుమారుడు వాసుదేవన్ వైభవ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీణాపాణినగర్కు చెందిన కార్పెంటర్ ద్రోణాచారి (52) గత నెల 29న మరో కార్పెంటర్ రవీంద్రచారితో కలిసి పని మీద బొల్లారం వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో భార్య సుధారాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.