కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మూడో టీఎంసీ పనులపై సుప్రీం  కోర్టు బుధవారం స్టే విధించింది.

పర్యావరణ అనుమతులు, డీపీఆర్‌ లేకుండా తెలంగాణ సర్కార్‌ నిర్మిస్తోందంటూ ఓ పిటిషన్‌ దాఖలు అయ్యింది. ఈ మేరకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా? అని సర్కార్‌ను ప్రశ్నించింది కోర్టు..  మూడో టీఎంసీ పనులపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు.

By admin

Leave a Reply

Your email address will not be published.